Tweet Follow @Sawthii |
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో మార్పింగ్ అనే పదం తరచూ వినిస్తోంది. పేరుమోసిన మ్యాగజైన్లపై పలువురు హీరోయిన్ల టాప్ లెస్ ఫోటోలు, బికినీ స్టిల్స్ దర్శనం ఇస్తున్నాయి. వారి ఫోజులపై ప్రశంసలు వస్తే సినిమాల్లో రెచ్చి పోయి ఎక్స్ ఫోజింగ్ చేయడం, విమర్శలు వస్తే...అందులో ఉన్నది నేనుకాదు, మార్పింగ్ చేశారంటూ గోల చేడయం హీరోయిన్లకు సర్వ సాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో హీరోయిన్లు చెప్పే మాటలు నమ్మాలా? వద్దా అనే అనుమానంలో కొందరుంటే...అంతపెద్ద మ్యాగజైన్లను మార్పింగ్ ఫోటోలను ఎందుకు ప్రచురిస్తాయని మరికొందరు సందేహిస్తున్నారు.
మరి ఈ కుంభకోణం వెనక నిజా నిజాల సంగతి పక్కన పెడితే ఈ వ్యవహారం వల్ల హీరోయిన్లకు, సదరు మ్యాగజైన్లకు ప్రీ పబ్లిసిటీ దక్కుతోందనేది కాదనలేని వాస్తవం. కొందరు హీరోయిన్ల టాప్ లెస్, బికినీలతో ఫోజులు ఇచ్చి పబ్లిసిటీ కోసం....మార్ఫింగ్ అనే పదాన్ని అడ్డం పెట్టుకుని గేమ్స్ ఆడుతుంటారని, ఇందులో మ్యాగజైన్ల పాత్ర కూడా ఉంటుందని వాదించే వాళ్లు లేక పోలేదు.
ఈ విధంగా వార్తల్లోకెక్కిన హీరోయిన్లను పరిశీలిస్తే...
కాజల్ : టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ ‘సింగం’ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టింది. వేడి ఉన్నప్పుడే వాడుకోవాలనే చందంగా సింగం సినిమా హిట్ టాక్ తెచ్చుకోగానే ఎఫ్.హెచ్.ఎం మ్యాగజైన్ పై కాజల్ టాప్ లెస్ ఫోటో దర్శనం ఇచ్చింది. ఈ ఫోటోపై సౌత్ జనాల నుంచి విమర్శలు రావడంతో వెంటనే మాట మార్చించిది కాజల్. ఆ ఫోటో తనది కాదంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఫోటో వాస్తవమే కావాలంటే ఫోటో షూట్ వీడియో చూపిస్తాం అని ఎఫ్.హెచ్.ఎం మ్యాగజైన్ వాదిస్తోంది. మరి వీళ్లలో ఎవరు చెప్పేది నిజమో?
సోనాక్షి : దబాంగ్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరియయం అయిన సోనాక్షి సిన్హా... ఆ మధ్య మాక్సిమ్ మ్యాగజైన్ పై బికినీతో దర్శనం ఇచ్చింది. ఆ ఫోటోను చూసి అది తన ఫోటో కాదు, మార్ఫింగ్ చేశారు అంటూ గోలగోల చేసింది. అయితే ఆ మ్యాగజైన్ పై సీరియస్ యాక్షన్ మాత్రం తీసుకోలేదు. విద్యా బాలన్ కూడా మాక్సిమ్ పై బికీనీతో దర్శనం ఇచ్చింది. సోనాక్షి మాదిరి ఈ విడ కూడా నేను బికినీ వేయలేదంటూ రచ్చరచ్చ చేసింది.
2009లో బాలీవుడ్ బేబీ సెలీనా జైట్లీ తన ఫోలు మార్పింగ్ చేసి..అసభ్యంగా బికీనీలో చూపెట్టిన గాడ్జెట్ బ్లాగ్ మరియు బాలీవుడ్ పోర్టల్ పై లీగల్ యాక్షన్ తీసుకుంది. మార్ఫింగ్ భామల లిస్టులో ‘రబ్ దే బనాదీ జోడీ’ ద్వారా పరిచయం అయిన అనుష్క శర్మ కూడా చేరి పోయింది. కొన్ని మ్యాగజైన్లపై ఆమె బికీనీ ఫోటోలు దర్శనం ఇచ్చాయి. ఇతర హీరోయిన్ల లాగే ఈ విడకూడా ఆ పోటో తనది కాదంటూ...ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసి చేతులు దులుపుకుంది.
No comments:
Post a Comment