Tweet Follow @Sawthii |
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, హాట్ లేడీ ప్రియాంక చోప్రా మధ్య ఎఫైర్ ఉందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. డాన్ సినిమా నుంచి ఇద్దరి మధ్య ‘సం‘బంధం మొదలైందని, అందుకే రాసుకుపూసుకు తిరుగుతున్నారనే గాసిప్స్ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరి స్నేహంపై షారుఖ్ భార్య గౌరీఖాన్ కోపంగా ఉందని, షారుఖ్ ను పలుసార్లు హెచ్చరించిందనే వార్తలు కూడా వనిపించాయి. ఈ రూమర్స్ ను ఎన్నోసార్లు కొట్టిపారేసిన షారుఖ్, ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.
తాజాగా బాలీవుడ్ నుంచి అందిన సమాచారం....ఈ పుకార్ల వెనక ఉన్న అసలు వ్యక్తి ‘నీలం కొఠారి’ అని తేలిసింది. షారుఖ్ భార్య గౌరీతో స్నేహం చేస్తున్న నీలం ఇలాంటి వార్తలను తన ఫ్రెండ్ సర్కిల్ లో ప్రచారం చేస్తోంది. తద్వారా మీడియాకు ఉప్పంది ఈ గాసిప్స్ పుట్చుకొచ్చాయని అంటున్నారు.
No comments:
Post a Comment