Tweet Follow @Sawthii |
హీరోలకంటే... హీరోయిన్లు ప్రవేశంతోనే ఇండస్ట్రీలో సెంటిమెంట్ వర్కవుటోంది... పురుష ప్రపంచం కనుక.. కొత్తగా పెళ్లైయిన ఇంటికి కోడలు కుడికాలుపెట్టి లోపలికి రావాలి. కొడుకు ఏ కాలుపెట్టాలనేది ఎవ్వరూ పట్టించుకోరు. సరిగ్గా... సినిమా ఇండస్ట్రీలో అదే జరుగుతుంది.
హీరోలు నటించిన సినిమాల్లో విషయం లేకపోయినా... హీరోకు పేరురాదు కానీ.. హీరోయిన్‌కు మంచి పేరు వచ్చేస్తుంది. ఆ పేర్లే గోల్డెన్ లెగ్‌లు.. ఐరన్ లెగ్‌లు.. మూఢనమ్మకాలకు పెద్ద పీట వేసే ఇండస్ట్రీలో ఇటువంటివి తలవంచక తప్పదు. ఒకప్పుడు గోల్డెన్ లెగ్.. ఇప్పుడు ఐరన్‌లెగ్‌గా మారుతుంది.
ప్రస్తుతం గోల్డెన్ లెగ్ ప్లేసును కాజల్ అగర్వాల్ ఆక్రమించింది. కాజల్ ఉంటే సినిమా హిట్ అనే స్థితికి వచ్చేశారు. రెండో స్థానంలోస్థానంలో త్రిష ఉంది. ఆ తర్వాత స్థానం నయన తారది. శ్రీరామరాజ్యం పెద్దగా వాణిజ్య సక్సెస్ కాలేకపోయినా... నయన.. సీతగా మరిపించి.. మెప్పించింది.. మార్కులు కొట్టేసింది. వీరి విషయంలో రెమ్యునరేషన్ గురించి నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడంలేదు.
అయితే ఒకప్పడు ఇలియానా అంటే... సక్సెస్ హీరోయిన్.. ఇప్పుడు ఆమె రూటుమారింది. అనుష్కది అదే స్థితి. గత ఏడాది శక్తి, నేను నా రాక్షసి ప్లాప్‌లతో ఇలియానాకు తెలుగులో డిమాండ్ తగ్గింది. అయినా తమిళంలో శక్తిమేరకు చేస్తుంది. అలాగే అనుష్క బాగున్నా... సక్సెస్ లేకపోవడంతో.. మార్కెట్ తగ్గింది. ఇదికాకుండా.. రెండుభాషల్లో గోల్డెన్ లెగ్.. తమన్నా ఆక్రమించుకుంది. ఎక్కువమంది యువహీరోలు ఆమెనే కోరుకుంటున్నారు.
ఇంకో విచిత్రం ఏమంటే...తెలుగులో ఐరన్‌లెగ్‌గా మారిన రాధ కుమార్తె రాధిక తమిళంలో కాస్త బెటర్‌గా నిలిచింది. నాగచైతన్యతో తొలిచిత్రం చేసినా ఇక్కడ కలిసిరాలేదు. తమిళంలో మంచి డిమాండ్ స్థాయికి చేరుకుంది. మరి సెంటిమెంట్‌ను మార్చేవరకు ఎవరో ఒక దర్శకుడు ముందుకు వస్తేనే... మళ్ళీ ఇండస్ట్రీలో గెల్డెన్ లెగ్ అనరు. ఆ ప్రయత్నమే అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ చేస్తున్నాడు. అందులో ఇలియానా హీరోయిన్. మరి ఏమవుతుందో వెయిట్ అండ్‌సీ..!
No comments:
Post a Comment