Tweet Follow @Sawthii |
రెండు దశాబ్దాల కెరీర్‌లో ఇప్పటివరకు తెర మీద ఏ తారకీ ఫ్రెంచి కిస్ ఇవ్వని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తొలిసారి ఓ అందాల భామకి పెదాల మీద ముద్దుపెట్టాడు. ఆమె కొత్తమ్మాయేమీ కాదు. టాప్ హీరోయిన్ అయిన కరీనా కపూర్. ఇదివరలో ఆ ఇద్దరూ 'అశోకా'లో వేడి వేడి సన్నివేశాల్లో నటించినా, ఒకరి పెదాల్ని ఒకరు తాకలేదు.
కానీ బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో అగ్రభాగాన ఉన్న 'రా.వన్'లో ఆ ఇద్దరూ పెదాల ముద్దుని ఎంజాయ్ చేశారు. ఒక రొమాంటిక్ సాంగ్‌లో ఈ సీను ఉన్నట్లు బాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చెప్పుకుంటున్నారు. 22 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో షారుఖ్ ఎవర్నీ ముద్దు పెట్టుకోకపోవడం ఇక్కడ గమనార్హం. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన 'రా.వన్' దీపావళి సందర్భంగా వచ్చే అక్టోబర్ 26న విడుదలవుతోంది. ఇందులో అర్జున్ రాంపాల్, టామ్ వు (చైనా నటుడు) కీలక పాత్రధారులు.
No comments:
Post a Comment